- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా, ఇజ్రాయెల్‌లతో జరిగిన యుద్ధం వల్ల ఇరాన్ ఇంధన రంగం తీవ్రంగా దెబ్బతిన్న కొన్ని నెలల తర్వాత, ఆ దేశం 7.5 ట్రిలియన్ ఘనపుటడుగులకు పైగా సహజ వాయువు నిల్వలను కనుగొంది. ఇరాన్‌లోని దక్షిణ ఫార్స్ ప్రావిన్స్‌లో కొత్తగా కనుగొన్న ఈ వాయువులో 5.7 ఘనపుటడుగులు వెలికితీయదగినదేనని చమురుశాఖ మంత్రి మొహసెన్ పక్నెజాద్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రం సౌత్ పార్స్‌లో 15 సంవత్సరాల ఉత్పత్తికి ఇది సమానమన్నారు.
- Advertisement -



