Monday, August 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్లాస్టిక్ ను నిషేధించి, పర్యావరణాన్ని కాపాడదాం

ప్లాస్టిక్ ను నిషేధించి, పర్యావరణాన్ని కాపాడదాం

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ 
పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించినట్లు భీంగల్ మున్సిపల్ కమిషనర్ గజానంద్ తెలిపారు. సీడీఎమ్‌ఏ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీంగల్ పట్టణంలోని అన్ని హోటల్స్, టిఫిన్ సెంటర్స్, బేకరీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్, కిరాణా షాప్, పండ్లు కూరగాయలు, మాంసం అమ్మే షాపులు, అన్ని రకాల వ్యాపార సముదాయాల యజమానుల వ్యాపారంలో సింగల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించారు. కావున అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించే యజమానులు ప్లాస్టిక్ ను వినియోగించకూడదని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ గజానంద్ హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -