Monday, August 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసారంపల్లి మల్లారెడ్డి మరణం పట్ల కేసీఆర్ సంతాపం

సారంపల్లి మల్లారెడ్డి మరణం పట్ల కేసీఆర్ సంతాపం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: అఖిల భారత రైతు సంఘం నేత, కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు, సారంపల్లి మల్లారెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. రైతాంగ సమస్యలపై, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం, తన జీవిత కాలం పోరాటం చేసిన నిబద్ధత కలిగిన రైతు ఉద్యమ నాయకుడు సారంపల్లి అని కేసీఆర్ తెలిపారు. వారి మరణం భారత రైతాంగ ఉద్యమానికి తీరని లోటని, మల్లారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -