నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం ప్రతి సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణికి రెండో వారం ఆరు దరఖాస్తులు అందాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి రెండు, రెవెన్యూ శాఖకు మూడు, హౌసింగ్ శాఖకు ఒక దరఖాస్తు చొప్పున మొత్తం ఆరు దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. గత సోమవారం నిర్వహించిన తొలి ప్రజావాణిలో 12 దరఖాస్తులు అందిన విషయం తెలిసిందే.
ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి, నిబంధనల మేరకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతతో పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రజావాణి నోడల్ అధికారి, ఎంపీడీవో వాల్మీకి కిశోర్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి పాల్గొన్నారు.



