Monday, August 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: ఎస్‌ఐ

బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: ఎస్‌ఐ

- Advertisement -

నవతెలంగాణ – తొగుట 
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని ఎస్ఐ వి. నవీన్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో కేజీబీవీలో కలెక్టర్ హేమలత డిసీపిఓ ఆదేశాల మేరకు ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి ఎస్ఐ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎస్‌ఐ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమనీ, బాల్య వివాహాలు చేసినా, సహకరించినా, చేసుకున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం శిక్షార్హులు అవుతారని తెలిపారు. బాలల బంగారు భవిష్యత్తును చిదిమేసి చిన్నతనంలోనే పెళ్లి చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయని, కష్టపడి చదివి, బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.

అనవసర విషయాలకు ఆకర్షితులు కావొద్దనీ, ముఖ్యంగా సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలనీ, పాఠశాలలు, కళాశాలలో ప్రభుత్వం అందిస్తున్న అల్పాహారం, భోజన వసతిని ఉపయోగించుకోవాలని, పూర్తి శ్రద్ధ చదువుపైనే పెట్టాలని చెప్పారు. అదేవిధంగా మీమీద మీ తలిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయొద్దని స్పష్టం చేశారు. చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు.

బాల్య వివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దుకోవడం మనందరి బాధ్యత అని ఆశ్రిత సిద్దిపేట జిల్లా కో – ఆర్డినేటర్ గణేష్ తెలిపారు. బాలబాలికల భవిష్యత్తుకు మనందరం భరోసానివ్వాలని, ఎక్కడైనా బాల్యవివాహాలు జరుపబోతున్నారని తెలిస్తే చైల్డ్ హెల్ప్ లైన్ 1098, లేదా 112, 100 కి సమాచారం ఇవ్వలని పేర్కొన్నారు. తద్వారా వారికి కౌన్సిలింగ్ చేసి వాటి వల్ల నష్టాలు అర్థమయ్యేలా వివరిస్తారని చెప్పారు. అనంతరం ఎస్ఐ నవీన్ బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 వాల్ పోస్టర్ ను ఆవిష్క రించారు. కార్యక్రమంలో తొగుట కేజీబీవీ స్పెషల్ ఆపిసర్ భాగ్యలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ రెడ్డి, మహిళా కానిస్టేబుల్ ఉమ, ఆశ్రిత కమ్యూని టీ సోషల్ వర్కర్ మౌనిక, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -