- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజాపంపిణీ వ్యవస్థ పారదర్శకంగా పనిచేయడం కోసం ప్రజా ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టిందని మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ సర్పంచ్ బండి స్వామి అన్నారు. సోమవారం లబ్ధిదారులకు ఆయన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డి, జిపిఓ గొట్టం నరేశ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు, రేషన్ డిలర్లు పాల్గొన్నారు.
- Advertisement -



