Monday, August 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కౌలాస్ నాళా ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో

కౌలాస్ నాళా ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటకలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురియడంతో నేడు కౌలాస్‌ నాళా ప్రాజెక్టుకు ఒక్కసారిగా 890 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు ఈఈ సుకుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వానాకాలంలో మొదటిసారి ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోందని చెప్పారు. ప్రాజెక్టులోని ఒక గేటు తెరిచి దిగువకు 510 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని చెప్పారు. అదేవిధంగా వరద కాలువ ద్వారా 80 క్కూసెక్కుల నీటిని పంట పొలాలకు సౌకర్యార్ధం విడుదల చేశామన్నారు. నీటి పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాజేక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 458 మీటర్లు ఉండగా..ప్రస్తుతం 457. 83 వద్ద నీటి ఉధృతి కొనసాగుతోందని చెప్పారు. ప్రాజేక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1.237 టీఎంసి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -