- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
తెలంగాణ శాసనసభలో మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్గా జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో బాధ్యతలు స్వీకరించారు. మైనారిటీల సంక్షేమం, హక్కుల పరిరక్షణతో పాటు వారి సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ , శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని తోట లక్ష్మీకాంతారావుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -



