నవతెలంగాణ-హైదరాబాద్: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మరో ఆందోళనకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 5న ఢిల్లీలో శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇండియా గేట్ నుండి ఢిల్లీలోని నూతన పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు నిరసన ర్యాలీ కొనసాగనుంది. జూలై 20న నీట్ పేపేర్ లీకేజ్ ను వ్యతిరేకిస్తూ విద్యార్థులు పార్లమెంట్ మార్చ్ నిర్వహించారని, యువత ఆందోళనల నేపథ్యంలో మోడీ ప్రభుత్వం పలు హామీలు ఇచ్చిందని, కానీ నేడు వాటిని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సీజేపీ ఆరోపించింది. కేంద్రం తీరుకు నిరసనగా తాము దేశవ్యాప్త నిరసనలకు పూనుకున్నామని సీజేపీ ఆరోపించింది.
దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్ల జాబితాను అందిస్తే, వాటిని రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని కోర్టు పేర్కొన్నప్పటికీ, ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదని తెలిపింది. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి లిఖితపూర్వక హామీ అందలేదని వివరించింది. ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, యువత, సామాన్య ప్రజలు శాంతియుతంగా, పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సీజేపీ విజ్ఞప్తి చేసింది.



