Monday, August 24, 2026
E-PAPER
Homeజాతీయంకులపరమైన దూషణలు.."ఏకలవ్య"విద్యార్థుల ఆందోళన

కులపరమైన దూషణలు..”ఏకలవ్య”విద్యార్థుల ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్ సెంధ్వా తాలుకాలోని జమ్లీ ఏకలవ్య ఆదర్శ రెసిడెన్షియల్ స్కూల్( Eklavya Adarsh Residential School ) విద్యార్థులు ఆందోళన బాటపట్డారు. కులపరమైన దూషణలు చేస్తూ అవమానిస్తున్నారని, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి 100మందికి పైగా ర్యాలీగా బయలు దేరారు. అనేక సార్లు ఉన్నతాధికారులకు తమ సమస్యలపై విన్నవించినా..స్పందన లేదని, తమ ముందే విన్నపాల లేఖలను చింపిపడేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహాల నుంచి దాదాపు 15 కిలో మీటర్లు పాదయాత్ర చేస్తూ ఆగ్రా-ముంబాయి రహదారిపై బైటాయించారు.

కలెక్టర్ స్వయంగా వచ్చి తమను కలిసే వరకు ధర్నా విరమించలేదని విద్యార్థులు భీష్మించారు. ఈ విషయం తెలుసుకున్న SDM, SDOP, అదనపు కలెక్టర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) వంటి పరిపాలనా, పోలీసు అధికారులు విద్యార్థుల వద్దకు చేరుకుని, వారు తిరిగి వెళ్లేలా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కానీ విద్యార్థులు తమ పాదయాత్రను కొనసాగించారు. స్వయంగా కలెక్టర్ వచ్చే వరకు నిరసననున విరమించలేదని స్పష్టం చేశారు.తాము గతంలో లేవనెత్తిన అనేక ఫిర్యాదులను పరిష్కరించలేదని, అలాగే తమ తల్లిదండ్రుల పట్ల కూడా అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు.

“మేము ఏకలవ్య జమ్లీకి చెందినవారము; మేము గతంలో కోరిన డిమాండ్లలో ఏ ఒక్కటీ నెరవేరలేదు. సేకరించిన ఫీడ్‌బ్యాక్ ఫారమ్‌లను మా కళ్ల ముందే చింపివేశారు. మా తల్లిదండ్రులకు గౌరవం దక్కడం లేదు, వారి ముఖం మీదే గేట్లు మూసివేస్తున్నారు,” అని ఒక విద్యార్థిని ఆరోపించింది. ఆమె ఇంకా మాట్లాడుతూ, “మేము కలెక్టర్ గారిని కలవాలనుకుంటున్నాము. మా సమస్యల గురించి వారికి చెప్పాలనుకుంటున్నాము” అని విద్యార్థులు మీడియతో పేర్కొన్నారు.

జమ్లీకి చెందిన విద్యార్థులు అనేక సమస్యలను లేవనెత్తారని, తాను వారిని కలిసి వారి ఆందోళనల గురించి వివరంగా చర్చించానని తెలిపారు. “పిల్లలకు కొన్ని సమస్యలు ఉన్నాయి, అందుకే మేము వారిని కలవడానికి వచ్చాము. వారు తమ సమస్యల గురించి మాకు చెప్పారు. వారిని ఉద్దేశించి కులపరమైన దూషణలు చేశారన్నదే ప్రధాన సమస్య. దీనితో పాటు, వారు మరికొన్ని చిన్న సమస్యలను కూడా లేవనెత్తారు, వాటి గురించి మేము వివరంగా చర్చించాము” అని బర్వానీ కలెక్టర్ జయతి సింగ్చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -