Monday, August 24, 2026
E-PAPER
Homeక్రైమ్కేపీహెచ్‌బీలో అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య

కేపీహెచ్‌బీలో అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శీతల్ (32) అనే వివాహిత తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్-6లోని పంచవటి అపార్ట్‌మెంట్స్‌లో శీతల్ తన భర్త పురుషోత్తమన్, అత్తమామలతో కలిసి నివసిస్తున్నారు. పురుషోత్తమన్ ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కేరళలోని కన్నూరుకు చెందిన శీతల్‌కు ఆరేళ్ల క్రితం వివాహం కాగా, వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.

సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో శీతల్ టెర్రస్ పైకి వెళ్లే మెట్లపై సుమారు 10 నిమిషాల పాటు కూర్చున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా పైకి వెళ్లి అపార్ట్‌మెంట్ ఆవరణలోకి దూకడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

శీతల్ కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నారని, అందుకు సంబంధించి మందులు కూడా వాడుతున్నారని ఆమె భర్త, కేరళలో ఉన్న సోదరుడు తమకు తెలిపినట్లు ఎస్సై శశిధర్ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. శీతల్ మరణవార్తను కేరళలోని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -