Sunday, September 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

- Advertisement -

తహసిల్దార్ చందా నరేష్ 
నవతెలంగాణ-నెల్లికుదురు 

మండలంలోని గ్రామాల ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయనున్నామని తహసిల్దార్ చందా నరేష్ తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిపిఎల్ కుటుంబాల ప్రజలకు ప్రభుత్వం అందించే 16,537 స్మార్ట్ రేషన్ కార్డులను లభ్దిదారులకు ఆయా గ్రామాల జిపిఓలు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడి టీచర్ల సమక్షంలో ప్రజలకు అందించనున్నామని చెప్పారు. దీనిని ఆయా గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో రేషన్ కార్డు స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డు ఉండబోతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆఫీసు సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -