Sunday, September 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే తోటా

మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే తోటా

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
తెలంగాణ శాసనసభలో మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైనారిటీల సంక్షేమం, హక్కుల పరిరక్షణతో పాటు వారి సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో గౌరవ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని తోట లక్ష్మీకాంతారావుకు శుభాకాంక్షలు తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే శాసనసభలో మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జుక్కల్ నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -