Monday, August 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలి

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలి

- Advertisement -

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్ 

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డితో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సోమవారం చర్చించారు. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన వారు.. ఆయా నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.  ఈసందర్భంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన కీలక అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ కడియం కావ్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

మౌలిక వసతుల కల్పన, పెండింగ్ సమస్యల పరిష్కారం, ప్రజలకు అవసరమైన వివిధ అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు తదితర అంశాలపై చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రిని కోరారు. అదేవిధంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన నిధులు, ప్రభుత్వ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వరంగల్ పార్లమెంట్, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నట్లు ఎంపీ, ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -