Wednesday, August 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసర్కారు అంగీకరించిన డిమాండ్లు నెరవేర్చాలి

సర్కారు అంగీకరించిన డిమాండ్లు నెరవేర్చాలి

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా 
ఎస్‌‌డబ్ల్యూఎఫ్ దీక్షలు
నవతెలంగాణ -హైదరాబాద్‌

ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించిన అంశాలు అమలు కోరుతూ మంగళవారం జరిగిన నిరాహార దీక్షలను జయప్రదం చేసిన అన్ని కమిటీలకు, కార్మికులకు ఎస్‌‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కమిటీ దన్యవాదాలు తెలియజేసింది. ఇందుకు సహాయ, సహకారం అందించిన సీఐటీయూ జిల్లా కమిటీలకు, దీక్షలకు మద్దతు తెలియ చేసిన ఇతర కార్మిక సంఘాలకు అభినందనలు తెలియచేసింది.
ఒక వైపు వాతావరణం సహకరించక పోవడం, మరో వైపు ఆర్టీసీ యాజమాన్యం విజిలెన్స్ వారి పేరుతో ఆటంకాలు సృష్టించడంతో పాటు పోలీస్ ను కూడా ఉపయోగించి దీక్షలు ఆర్టీసీ భూమితో పరిసరాలలో కూడా నిరాహారదీక్ష కొరకు టెంట్ వేసుకోకుండా అడ్డుకున్నప్పటికి కార్మికులు , నాయకుల సంకల్పం ముందు అవన్నీ పనిచేయలేదని పేర్కొన్నది. ఎస్‌‌డబ్ల్యూఎఫ్‌ నాయకత్వంలో దీక్షలు జయప్రదంగా చేయడం అనేది సమస్యల పరిష్కారం పట్ల కార్మికులలో ఉన్న కోర్కె, పట్టుదలను వ్యక్తం చేసిందని ఆ సంఘం అధ్యక్షులు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి విఎస్‌ ‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించిన అంశాలు అమలు చేయాలనీ, అలవెన్సులు 80 శాతం పెంచి తక్షణమే అమలు చేయాలని కోరారు. బ్రెడ్ విన్నర్ స్కీం లో వారిని రెగ్యులర్ చేయడం తో పాటు వారి సర్వీస్ ను రక్షించాలనీ, ఉద్యోగ భద్రత కల్పించాలనీ, అవసరమైన నిబంధనలను సవరించాలని కోరారు. మెదక్ రీజియన్ కేంద్రం సంగారెడ్డి లో జరిగే దీక్షలను రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు, ఖమ్మం దీక్షలను ఉప ప్రధాన కార్యదర్శి జి. లింగమూర్తి, ఖమ్మం రీజియన్ అధ్యక్షులు, కార్యదర్శి గుండు మాధవరావు, పిట్టల సుధాకర్ లు, నల్గొండ రీజియన్ లోని సూర్యాపేట లో రాష్ట్ర కార్యదర్శి బత్తుల సుధాకర్,వరంగల్ రీజియన్ దీక్షలకు రాష్ట్ర ఉపాధ్యక్షులు సి హెచ్. రాంచందర్, రీజియన్ అధ్యక్షులు, కార్యదర్శి ఎల్లయ్య, ఉపేంద్రా చారి, కరీంనగర్ లో రీజియన్ అధ్యక్షులు, కార్యదర్శి రాపల్లి రాజయ్య, వి. శ్రీనివాస్, సికింద్రాబాద్ రీజియన్ కేంద్రం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. గీత, మహబూబ్‌‌నగర్‌ రీజియిన్ లో రీజియన్ అధ్యక్షులు, కార్యదర్శి కృష్ణయ్య, వెంకటయ్య తదితరులు నాయకత్వం వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -