Wednesday, August 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేత్రదానానికి ముందుకు రండి

నేత్రదానానికి ముందుకు రండి

- Advertisement -


డాక్టర్ రమాదేవి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

ప్రజలు నేత్రదానానికి ముందుకు రావాలని డీఎంఈ (అకడమిక్) డాక్టర్ రమాదేవి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నేత్రదాన పక్షోత్సవాల ప్రారంభం సందర్భంగా మంగళవారం హైదరాబాద్ జిల్లా అంధత్వ నివారణ సంస్థ, సరోజినీ దేవి నేత్ర వైద్యశాల సంయుక్తాధ్వర్యయంలో ఆస్పత్రి వద్ద వాక్ థాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకరు చేసే నేత్రదానంతో ఇద్దరు అంధులకు చూపు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గాన్ డొనేషన్ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ భూషణ్, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ సహాయ్, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.సాంబశివా రెడ్డి, జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సుపేర్ణ, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -