మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తీసే ప్రతి చిత్రం చారిత్రక రికార్డులో ఒక భాగమై, చరిత్ర గమనాన్ని మార్చే శక్తి ఫొటోజర్నలిస్టులకే ఉంటుందని మాజీ మంత్రి, పొన్నాల ఫౌండేషన్ చైర్మన్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. హైదరాబాద్, బషీర్ బాగ్, దేశోద్ధారక భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఫొటోజర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేసిన ఉత్తమ వార్త చిత్రాల ప్రదర్శన 2026 ను మంగళవారం పొన్నాల లక్ష్మయ్య తిలకించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఫొటో జర్నలిజానికి తగిన అద్భుతమైన ఛాయాచిత్రాలు మన రాష్ట్రానికి చెందిన ఫొటోజర్నలిస్టులు ప్రదర్శించడం అభినందనీయమన్నారు. నేటి సమాజంలో ఫోటో జర్నలిజం అత్యంత కీలకం అని, ఇది వాస్తవ సంఘటనలను చూపడానికి, వాస్తవాలను నిరూపించడానికి మరియు అన్యాయాన్ని బయటపెట్టడానికి నిజాయితీతో కూడిన చిత్రాలను ఉపయోగిస్తుందని తెలిపారు. మనం తెరలు, సోషల్ మీడియా మరియు కృత్రిమ చిత్రాలతో నిండిన ప్రపంచంలో నేడు జీవిస్తున్నామని, ఫొటోజర్నలిస్టులు వాస్తవికతకు స్పష్టమైన అద్దంలా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫొటోజర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఎన్. హరి, ఉపాధ్యక్షులు టి. కిషోర్ సింగ్, పి. రామ్మూర్తి, కోశాధికారి కె. అనిల్ కుమార్, కార్యవర్గ సభ్యులు పి. హరికృష్ణ, ఏ. మహేష్ కుమార్, ఎన్. శివ కుమార్, నగర గోపాల్, నాయకులు ఏ. పవన్ కుమార్, ఎండి. బషీర్, కె. సుమన్ రెడ్డి, కుంట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చరిత్ర గమనాన్ని మార్చే శక్తి ఫొటో జర్నలిస్టులదే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



