- Advertisement -
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సారంపల్లి మల్లారెడ్డి రైతులు, కౌలు రైతుల హక్కుల కోసం, సంక్షేమం కోసం జీవితమంతా పోరాడారని, ఆయన మృతి రైతాంగానికి తీవ్ర నష్టమని హేమలత, వరవరరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ముంబాయి నుంచి ఒక ప్రకటన పంపారు. మల్లారెడ్డికి సంతాపాన్ని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, ఆయన సంతానానికి సంఘీభావాన్ని తెలిపారు. సారంపల్లి మల్లారెడ్డి బతుకంతా రైతు జీవిత సారమని తెలిపారు. తమ అవిభక్త వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలిసిన చిరకాల మిత్రుడు సారంపల్లి మల్లారెడ్డి అని అన్నారు.
- Advertisement -



