15 నియోజకవర్గాల్లో టెండర్ ప్రక్రియ పూర్తి
ఈ నెల 28 నుంచి 31 వరకు లక్కీ డ్రా
మరో 4 నియోజకవర్గాల్లో దరఖాస్తులకు ఆహ్వానం
సెప్టెంబర్ 3 వరకు స్వీకరణ : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం వేగవంతం చేశామనీ, 15 నియోజకవర్గాల్లో టెండర్ ప్రక్రియ పూర్తి అయిందని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లోని సచివాలయంలో ఆయన సమీక్షించారు. క్యూర్ పరిధిలోని తొలి విడతలో ప్రయోగాత్మకంగా 16 నియోజకవర్గాల్లో రూ.807.40 కోట్ల అంచనా వ్యయంతో టవర్స్ నిర్మిస్తున్నట్టు తెలిపారు. మొత్తం 60,720 దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించి 40,900 మందిని అర్హులుగా గుర్తించినట్టు చెప్పారు. ఈ నెల 28, 29, 30, 31 తేదీల్లో ఆయా ప్రాంతాల్లో అర్హులైన దరఖాస్తుదారుల సమక్షంలోనే పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహిస్తామని తెలిపారు. లబ్ధిదారుల తుది జాబితా ప్రకటించిన తర్వాత ఎంపిక కాని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన రూ.10,000 ఈఎండీ మొత్తాన్ని వెంటనే వారి ఖాతాల్లోకి తిరిగి జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో ఎల్‌బీనగర్ నియోజకవర్గం లో హయత్‌నగర్ గ్రామంలోని అమంగల్, గోషామహల్ నియోజకవర్గంలోని నాంపల్లి, ముషీరాబాద్ నియోజకవర్గంలోని జమిస్తాన్‌పూర్ (ఆర్టీసీ క్వార్టర్స్), చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడలో (ఫలక్‌నుమా సమీపంలో) ఇండ్లకు సెప్టెంబర్ 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చేసుకోవాలని ఆయన ఆహ్వానించారు. మంత్రి పొంగులేటి తెలిపారు.



