Wednesday, August 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబీసీలకు స్థిరత్వం వచ్చే వరకు రిజర్వేషన్లు

బీసీలకు స్థిరత్వం వచ్చే వరకు రిజర్వేషన్లు

- Advertisement -

రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మెన్ జి.నిరంజన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

బీసీలకు ఆర్థికంగా, సామాజికంగా స్థిరత్వం వచ్చేంత వరకు రిజర్వేషన్లు అమలులో ఉండాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మెన్ జి.నిరంజన్ అభిప్రాయపడ్డారు. మంగళవారం హైదరాబాద్ లోని బీసీ కమిషన్ కార్యాలయంలో బిందేశ్వర్ ప్రసాద్ మండల్ (బిపి మండల్) 108వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ బీసీలకు 27 శాతం రిజర్వేషన్ సాధించటం లో బీపీ మండల్ తొలి అడుగు వేశారని తెలిపారు. మండల్ సిఫారసులను మాజీ ప్రధానమంత్రి వి.పి.సింగ్ అమలు చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం మేరకు రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్లు సాధించే దిశలో ఉద్యమించాల్సిన అవసరం ఉందని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో కులగణన చేస్తామని ప్రకటించినా, ఈ నెల 14న విడుదల చేసిన నోటిఫికేషన్ లో బీసీ కులాలగణన ప్రస్తావన లేకపోవడం పట్ల ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
రాష్ట్రాల వారీగా బీసీ కులాల జాబితాను పొందుపరిచి డ్రాప్ డౌన్ పద్ధతిలో కుల వివరాలను సేకరించాలని కేంద్రాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మీ రంగు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -