Wednesday, August 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆశ్రమ పాఠశాలల పండిట్, పీఈటీలను అప్‌గ్రేడ్ చేయాలి

ఆశ్రమ పాఠశాలల పండిట్, పీఈటీలను అప్‌గ్రేడ్ చేయాలి

- Advertisement -


ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

ఆశ్రమ పాఠశాలల పండిట్, పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కోరారు. మంగళవారం శాసనసభ, శాసనమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ ప్రారంభ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ రెండు కమిటీల్లో ఆయన సభ్యులుగా నియామకం అయ్యారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులుకు వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు ఉన్నత విద్య అభ్యసించేందుకు వీలుగా జీవో 342ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారికి వేతనంతో కూడిన సెలవును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -