Wednesday, August 26, 2026
E-PAPER
Homeక్రైమ్ఇద్దరు చిన్నారుల కిడ్నాప్‌

ఇద్దరు చిన్నారుల కిడ్నాప్‌

- Advertisement -

గచ్చిబౌలి పోలీస్ ‌స్టేషన్‌ ‌పరిధిలో ఘటన
కేసును ఛేదించిన పోలీసులు
​నవతెలంగాణ-మియాపూర్

​ఇద్దరు చిన్నారుల కిడ్నాప్‌ ‌కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి పీఎస్‌ ‌పరిధిలోని రాఘవ ప్రాజెక్ట్‌ లేబర్‌ క్యాంప్‌లో పనిచేస్తున్న వారి పిల్లలు ప్రమీలా ముర్ము, సంగీత అనే ఇద్దరు బాలికలు కిడ్నాప్‌‌కు గురయ్యారు. అక్కడే పనిచేసే చాకు సోరెన్‌ సోమవారం రాత్రి షాప్‌‌కు వెళ్తున్నానని చెప్పి పిల్లలను వెంట తీసుకెళ్లాడు. అయితే ఎంతసేపటికీ చిన్నారులు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. అర్ధరాత్రి దాటినా చిన్నారులతో పాటు చాకు సోరెన్‌ కూడా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు చిన్నారులను తీసుకెళ్లిన వ్యక్తి కదలికలను గుర్తించారు. అనంతరం ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌లో చాకు సోరెన్‌ను అదుపులోకి తీసుకుని, చిన్నారులను సురక్షితంగా రక్షించారు. అనంతరం ఇద్దరు బాలికలను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -