Wednesday, August 26, 2026
E-PAPER
Homeక్రైమ్అక్రమంగా యూరియా నిల్వ

అక్రమంగా యూరియా నిల్వ

- Advertisement -


​పెద్దపల్లి జిల్లాలో 600 బస్తాలు స్వాధీనం
పోలీసుల అదుపులో నిందితుడు
నవతెలంగాణ – పెద్దపల్లి రూరల్

​అక్రమంగా నిల్వ ఉంచిన 600యూరియా బస్తాలను పెద్దపల్లి జిల్లాలో టాస్క్‌ఫోర్స్, పెద్దపల్లి రూరల్ పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాలు మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ శ్రీనివాసులు నేతృత్వంలో పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాసులపల్లి గ్రామంలో తనిఖీలు చేశారు. హకా ఫార్మర్స్ సర్వీస్ సెంటర్‌లో యూరియా బస్తాలను అక్రమంగా డంప్ చేసి నిల్వ ఉంచినట్టు నార్కోటిక్/టాస్క్‌ఫోర్స్ టీమ్ కి సమాచారం అందింది. టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ దీకొండ రమేష్, లక్ష్మణ్ రావు, పెద్దపల్లి రూరల్ ఎస్ఐ మధుకర్ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారితో కలిసి కాసులపల్లిలో తనిఖీలు నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన అడెపు సంపత్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 600 యూరియా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. యూరియా విలువ రూ.3.60లక్షలు కాగా, వాటిని పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -