Wednesday, August 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅవాంఛనీయ ఘటనలు జరగకుండా సంయుక్త కార్యాచరణ

అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంయుక్త కార్యాచరణ

- Advertisement -

హైడ్రా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంయుక్త కార్యాచరణతో ముందుకెళ్లాలని హైడ్రా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్ణయించాయి. ఈ మేరకు మంగళవారం బోర్డు కార్యాలయంలో ప్రయివేటు జూనియర్ కళాశాలల యాజమానులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో హైడ్రా కమిషనర్ ఏ.వీ.రంగనాథ్, బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ పాల్గొన్నారు. వారు విద్యార్థుల భద్రత, అగ్నిమాపక భద్రతా మార్గదర్శకాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజ్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫైర్ ఎన్ఓసీల సులభ ధృవీకరణ కోసం అగ్నిమాపక శాఖ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌వేర్ ఇంటర్వెన్షన్‌తో ముందుకెళ్లాలని నిర్ణయించారు. అగ్నిమాపక భద్రతకు సంబంధించిన ఇతర కీలక అంశాలను పరిష్కరించడానికి తదుపరి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
ప్రజలు బోర్డు ఇచ్చే అధికారిక సమాచారంపైనే ఆధారపడాలనీ, వదంతులను నమ్మొద్దని అధికారులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -