Wednesday, August 26, 2026
E-PAPER
Homeబీజినెస్ఈ ఏడాది అతిపెద్ద దక్షిణాది చిత్రాల జాబితాతో అభిమానుల ముందుకొస్తున్న నెట్ ఫ్లీక్స్

ఈ ఏడాది అతిపెద్ద దక్షిణాది చిత్రాల జాబితాతో అభిమానుల ముందుకొస్తున్న నెట్ ఫ్లీక్స్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: దక్షిణ భారతీయకథాకథనాల పట్ల తమ నిబద్ధతను రెట్టింపు చేస్తూ, ఈ సంవత్సరం మిగిలిన కాలంలో తమిళ, తెలుగు, మలయాళ చిత్రసీమల నుండి సగటున ప్రతి వారం ఒక కొత్త చిత్రాన్ని నెటిక్స్ విడుదల చేయనుంది. 2026 తొలి అర్ధభాగంలో సాధించిన రికార్డు స్థాయి విజయానికి కొనసాగింపుగా, విభిన్నమైన, ఆసక్తికరమైన చిత్రాలతో తమ కంటెంట్ జాబితాను నెటిక్స్ మరింత విస్తరిస్తోంది. ఇందులో ప్రముఖ చిత్రనిర్మాతలు, అభిమాన తారలు, వివిధజోనర్లలు, విభిన్న మూడ్లకు సరిపోయే కథలు చోటు చేసుకోనున్నాయి.

వినోద ప్రియులకు దీని అర్థం ఒక్కటే-నెటిక్స్లో ఎప్పటికప్పుడు కొత్తగా కనుగొనేందుకు ఏదో ఒక ఆసక్తికరమైన కథ అందుబాటులో ఉంటుంది. భారీ బ్లాక్బస్టర్ నుండి ఆకట్టుకునే, హృదయాన్ని కదిలించే కథల వరకు 2026 మొదటి అర్ధభాగంలో నెటిక్స్ భారతీయ చిత్రాల జాబితా అన్నింటికీ చోటు కల్పించింది. యూత్, విత్ లవ్, బ్లాస్ట్ మరియు భరతనాట్యం 2: మోహినియాట్టం వంటి చిత్రాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -