- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో ‘చేయూత’ పథకం కింద కొత్త పింఛనుదారుల ఎంపిక ప్రక్రియ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు పెన్షన్ దరఖాస్తులకు గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండగా.. సెప్టెంబరు 1 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించాలని సెర్ప్ సంస్థ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రాధాన్యత క్రమంలో అర్హత కలిగిన వారందరికీ పెన్షన్ సాయం అందేలా ఎంపిక చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల పెన్షన్లు పంపిణీ చేయాలని సర్కార్ టార్గెట్‌గా పెట్టుకోగా.. ప్రస్తుతం 3 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
- Advertisement -



