Wednesday, August 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కృత్రిమ కొరతతో పెరిగిన చక్కెర ధర..

కృత్రిమ కొరతతో పెరిగిన చక్కెర ధర..

- Advertisement -

– పండగల వేళ వ్యాపారుల దోపిడీ
నవతెలంగాణ – మల్హర్ రావు : ఉదయం నిద్ర లేచిన నుంచి పడుకునేవరకు చక్కెర లేకుండా గడవడం కష్టమే.వారం రోజులుగా పంచదార ధర అమాంతం పెర గగా అవాక్కవడం వినియోగదారుడి వంతవుతోంది.వారం క్రితం 50కిలోల బస్తా హోల్సేల్ ధర రూ.2,100 ఉండగా ప్రస్తుతం రూ.3,250కి ఎగ బాకింది.ఒక్కో బస్తాపై రూ.1,150 పెరగడం గమనార్హం. సూపర్ బజార్లు,కిరాణా దుకాణాల్లో మొన్నటి వరకు కిలో పంచదార రూ.45 ఉండగా ప్రస్తుతం రూ.65 నుంచి రూ.68కు విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.70 దాటేసింది. రాఖీ,వినాయక చవితి,దసరా, దీపావళి పండగల నేపథ్యంలో చక్కెర ధరలు పెరగడంతో సేమ్యా,పాయసం,తదితర తీపి పదార్థాలు ఎలా వండాలని సామాన్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి మరింత దండుకునేందుకు సిండికెట్కు వ్యూహరచన చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి ముడిచమురు దిగుమతిని తగ్గించుకునేందుకు పెట్రోల్లో 20శాతం ఇథనాలు కలిపే విధానం (ఈ-20) తీసుకొచ్చింది.ఇథనాల్ తయారీకి ప్రధానంగా చెరకు వినియోగిస్తున్నారు. ఎలినినో ప్రభావంతో దేశీయంగా చెరుకు సాగు,దిగుబడులు తగ్గడం, రానున్న రోజుల్లో చక్కెర ధరలు మరింత పెరుగుతాయనే ఉద్దేశంతో కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడంతో ధరలు అమాంతం పెరిగాయి.పండగ సీజన్లను దృష్టిలో ఉంచుకుని ధరలు అదుపులో ఉండేలా కేంద్రం చక్కెర నిల్వలపై ఆంక్షలు విధించింది.వ్యాపారులు 15 రోజుల అవసరాలకు మించి నిల్వ ఉంచు కోరాదని ఆదేశాలు జారీ చేసింది.చక్కెర హోల్సేల్ వ్యాపారులు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో చక్కెర కర్మాగారాలు ఎక్కువగా ఉండగా ఎక్కువగా అక్కడి నుంచే దిగుమతి జరుగుతోంది.భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో రోజూ సగటున 150 మెట్రిక్ టన్నుల విక్రయాలు జరుగు తున్నాయని సమాచారం.చక్కెర  వ్యాపారులు రోజురోజుకు ధరలు పెంచుతుంటే సంబంధించిన అధికారులు నియంత్రించకపోవడం యంత్రాంగం నిర్లక్ష్యాన్ని చూపుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -