నవతెలంగాణ-ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి నలంద హైస్కూల్‌లో ఉపాధ్యాయుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచేందుకు ఇంగ్లీష్ మంత్ర ట్రైనింగ్ ప్రోగ్రామ్ బుధవారం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ట్రైనర్ అజయ్‌జీ నిర్వహించారు. తరగతి గదిలో ఇంగ్లీష్‌ను సమర్థవంతంగా ఉపయోగించడం, సరైన ఉచ్చారణ, కాన్ఫిడెంట్ కమ్యూనికేషన్ మరియు విద్యార్థులతో మెరుగైన ఇంగ్లీష్ ఇంటరాక్షన్‌పై ఉపాధ్యాయులకు ప్రాక్టికల్‌గా శిక్షణ అందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని, తమ బోధనా నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునేందుకు విలువైన విషయాలను నేర్చుకున్నారు. నలంద యాజమాన్యం ట్రైనర్ అజయ్‌జీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఉపాధ్యాయులు తమ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని సూచించింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.



