- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నాయకుడు మడావి హిడ్మా వ్యక్తిగత గన్‌మెన్ ముచ్చిక మంగితో పాటు మరో ఇద్దరు దళ సభ్యులు లక్ష్మయ్య, ఎంకా బుధవారం ఆయుధాలు వదిలి పోలీసులకు లొంగిపోయారు. పీఎల్‌జీఏ సభ్యుడైన మంగి, భద్రతా బలగాలతో జరిగిన 7 భారీ ఎన్‌కౌంటర్లలో నేరుగా పాల్గొన్నాడు. పోలవరం జిల్లా ఓఎస్డీ సమక్షంలో వీరు లొంగిపోగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాస పథకాలు అందిస్తామని పోలీసులు తెలిపారు. అత్యంత నమ్మకస్తుడైన రక్షకుడు లొంగిపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టు కేడర్ మరింత బలహీనపడింది.
- Advertisement -



