అణు ఒప్పందం అమలుపై ట్రంప్ మెలిక
వాషింగ్టన్ : పౌర అణు ఇంధనంపై సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న ప్రతిపాదిత ఒప్పందాన్ని ఆమోదం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్‌కు పంపారు. అయితే ఇజ్రాయిల్‌ను సౌదీ గుర్తించి, సాధారణ సంబంధాలను ఏర్పరచుకుంటేనే ఒప్పందం అమలులోకి వస్తుందని మెలిక పెట్టారు. అయితే ఇజ్రాయిల్‌ను గుర్తించాలంటే పాలస్తీనా రాజ్యం ఏర్పాటుకు తిరుగులేని బాట వేయాలని సౌదీ అరేబియా డిమాండ్ చేస్తోంది. అమెరికా-సౌదీ అరేబియా మధ్య జూలైలో అణు ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. దీని ద్వారా సౌదీకి అమెరికా కంపెనీలు పౌర అణు పరిజ్ఞానాన్ని అందజేస్తాయి. అబ్రహం ఒప్పందాలలో సౌదీ చేరినప్పుడే ఈ ఒప్పందం ముందుకు కదులుతుందని, ఈ విషయంలో ట్రంప్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వ అధికారి ఒకరు స్పష్టం చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయిల్‌కు, యూఏఈ, బV్‌ారైన్, మొరాకో, సూడాన్ దేశాలకు మధ్య 2020, 2021 సంవత్సరాలలో అబ్రహం ఒప్పందాలు కుదిరాయి. ఇజ్రాయిల్, అరబ్-ముస్లిం మెజారిటీ దేశాల మధ్య సంబంధాల కోసం దీనిని ఉద్దేశించారు.
ఇజ్రాయిల్‌ను సౌదీ గుర్తించాల్సిందే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



