నవతెలంగాణ – కామారెడ్డి : మాచారెడ్డి పీఏసీఎస్ చైర్మన్ గా ఎన్నికైన మాలోత్ నౌసీలాల్‌ను కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే పేదలు, రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేసే ప్రభుత్వమని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పీఏసీఎస్ డైరెక్టర్లు పనిచేస్తారని పేర్కొన్నారు. రైతును రాజుగా చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కైలాస్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నర్సింగ్ రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
మాచారెడ్డి పీఏసీఎస్ డైరెక్టర్‌గా మాలోత్ నౌసీలాల్ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



