Thursday, August 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ పార్టీకి రాజీనామా.. బీఆర్ఎస్‌లో చేరిక

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా.. బీఆర్ఎస్‌లో చేరిక

- Advertisement -

–  గర్గుల్ ఉప సర్పంచ్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు 30 మంది కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరిక
నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు 30 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గురువారం బీఆర్ఎస్‌లో చేరారు. కామారెడ్డిలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసంలో వారికి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను గాలికి వదిలేసి తుగ్లక్ పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పలువురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. ప్రజాపాలనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు కాంగ్రెస్ కార్యకర్తల రాజీనామాలు, బీఆర్ఎస్‌లో చేరికలే నిదర్శనమని పేర్కొన్నారు. కేవలం అధికారం కోసం అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వాటి అమలును విస్మరించిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ ప్రధాన కార్యదర్శి గూడెం బాలరాజుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -