Thursday, August 27, 2026
E-PAPER
Homeబీజినెస్రాజమండ్రి, మల్లినా నగర్‌లో తమ కొత్త షోరూమ్‌ను ప్రారంభించనున్న కళ్యాణ్ జ్యువెలర్స్

రాజమండ్రి, మల్లినా నగర్‌లో తమ కొత్త షోరూమ్‌ను ప్రారంభించనున్న కళ్యాణ్ జ్యువెలర్స్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే,  ప్రముఖ ఆభరణాల బ్రాండ్‌లలో ఒకటైన కళ్యాణ్ జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి జిల్లా, మల్లినా నగర్, జె.ఎన్. రోడ్డులో తమ కొత్త భారీ షోరూమ్‌ను ప్రారంభించనున్నట్లు ఈరోజు ప్రకటించింది. ఈ షో రూమ్ ను సినీ నటుడు శ్రీ అక్కినేని నాగార్జున గారు సెప్టెంబర్ 1వ తేదీ (మంగళవారం) సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభించనున్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో  ఈ బ్రాండ్‌ కు ఇది 12వ అవుట్‌లెట్. 

 కొత్త షోరూమ్ ప్రారంభంపై కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ, “ఒక కంపెనీగా, వినియోగదారుల షాపింగ్ అనుభవాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే  ఒక సంపూర్ణ వ్యవస్థను నిర్మించడంలో మేము గణనీయమైన పురోగతి సాధించాము. మా అత్యంత ముఖ్యమైన మార్కెట్లలో ఒకటిగా  ఆంధ్రప్రదేశ్ నిలిచింది.  మల్లినా నగర్‌లోని కొత్త షోరూమ్, మా వినియోగదారులకు మెరుగైన సౌకర్యం, విలువను అందిస్తూ ఈ ప్రాంతం పట్ల మా నిబద్ధతను మరింత గా వెల్లడిస్తుందని మేము విశ్వసిస్తున్నాము” అని అన్నారు.

ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, కళ్యాణ్ జ్యువెలర్స్  ప్రత్యేకమైన రీతిలో ఇన్-స్టోర్ ఆఫర్లను ప్రవేశపెట్టింది. విలువ జోడింపు*పై 30% తగ్గింపుతో పాటు, మార్కెట్‌లోనే అత్యంత తక్కువగా, అన్ని షోరూమ్‌లలో ఒకే విధంగా ఉండే కళ్యాణ్ స్పెషల్ గోల్డ్ బోర్డ్ రేటు ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. ఈ ప్రారంభ ప్రయోజనాలు పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

బ్రాండ్, దాని కలెక్షన్‌లు మరియు ఆఫర్‌ల గురించి మరింత సమాచారం కోసం, https://www.kalyanjewellers.net/ ని సందర్శించండి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -