నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ – అమెరికా రక్షణ రంగంలో మరో ముందడుగు పడింది. యుఎస్ నుంచి ‘జావెలిన్’ యాంటీ ట్యాంక్ క్షిపణుల కొనుగోలుకు ఇరు దేశాల అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు అమెరికా ఫారిన్ మిలిటరీ సేల్స్ (FMS) ప్రక్రియ ద్వారా లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ (LOA)పై భారత అధికారులు సంతకం చేశారు. ‘జావెలిన్’ డీల్‌తో ఇరుదేశాల మధ్య సరికొత్త అధ్యాయం మొదలైందని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. ‘ఫైర్ అండ్ ఫర్గెట్’ ఆటోమేటిక్ టెక్నాలజీతో జావెలిన్ మిస్సైళ్లు పనిచేస్తాయని వివరించారు. శత్రు దేశాల సరిహద్దుల్లో ట్యాంకులు, బంకర్లు, సాయుధ వాహనాలను ధ్వంసం చేయడంలో ఈ ఆయుధాలు కీలక పాత్ర పోషిస్తాయని అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు.
యుఎస్ నుంచి ఇండియాకు ‘జావెలిన్’ క్షిపణులు
- Advertisement -
- Advertisement -



