నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్ లో ఆకస్మిక వరదలు పెను విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. భోటెకోషి, త్రిశూలి నదీ పరీవాహక ప్రాంతాల్లో సంభవించిన వరద విపత్తులో దాదాపు 469 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గల్లంతయ్యారు. అయితే ఆపద్కాలంలో నేపాల్ ను ఆదుకోవడానికి పలు దేశాలు ముందుకొచ్చాయి. భారత్, చైనా, అమెరికా, బ్రిటన్, జపాన్, సౌత్ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి అనేక దేశాలు సహాయం అందించడానికి ముందుకు రాగా, ఆయా దేశాల ప్రతిపాదనలను నేపాల్ ప్రభుత్వం తిరస్కరించింది. తమ సొంత భద్రతా బలగాలే ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను సమర్థవంతంగా నిర్వహించగలవని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
2015లో సంభవించిన భారీ భూకంపమే తమకు గుణపాఠం అని తెలియజేసింది. ఆ సమయంలో విదేశాల నుంచి పెద్ద ఎత్తున సహాయక బృందాలు రావడంతో సమన్వయం, నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయని, రెస్క్యూ బాధ్యతలను పూర్తిగా నేపాల్ పోలీసు, సైనిక బలగాలకే అప్పగించమంది. ఆర్థిక సాయం అందిచాల్సిందిగా ఆయా దేశాలతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలను నేపాల్ కోరింది.



