Saturday, August 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలువివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ

వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ

- Advertisement -

ఓ సినిమా విజయం సదరు హీరోకి మరిన్ని అవకాశాలను తీసుకొచ్చి పెడుతుందనే దానికి ప్రత్యక్ష‍ ఉదాహరణగా హీరో రవితేజ నిలుస్తున్నారు. తాజాగా ఆయన నటించిన ‘ఇరుముడి’ సినిమా విశేష ప్రేక్ష‍కాదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అంతేకాదు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్‌తో హీరో రవితేజకి బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమా ఆఫర్లు వస్తున్నాయి.
ఇప్పటికే యువ దర్శకుడు హసిత్‌ గోలీతో ఓ సినిమా చేసేందుకు పచ్చ జెండా ఊపిన రవితేజ తాజాగా ‘సరిపోదా శనివారం’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయతో రవితేజ జతకట్టనున్నారు. ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధిస్తూ, రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక వేడుకలో దర్శకుడు వివేక్ ఆత్రేయ, నిర్మాతలు లక్ష్మణ్, శ్రీని.. రవితేజను కలిసి బ్లాక్‌బస్టర్ విజయానికి అభినందనలు తెలిపారు. రవితేజ, వివేక్ ఆత్రేయ, లక్ష్మణ్, శ్రీని, బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ కొత్త చిత్రం ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తోంది. రవితేజ, వివేక్ ఆత్రేయ కలయికలో రాబోతున్న ఈ సినిమా ప్రత్యేకమైన కాంబినేషన్‌గా నిలవనుంది. వివేక్ ఆత్రేయ తనదైన ట్రీట్‌మెంట్‌తో రూపొందించే ప్రపంచంలోకి రవితేజ అడుగుపెట్టడం ద్వారా సరికొత్త సినీ అనుభూతి అందించనున్నారు. రవితేజ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్, లార్జర్-దేన్-లైఫ్ పర్సనాలిటీకి వివేక్ ఆత్రేయ స్టైల్ ప్రత్యేకంగా నిలవనుంది. దర్శకుడు హసిత్ గోలితో రవితేజ చేయనున్న సినిమా పూర్తయిన తర్వాత ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -