Saturday, August 29, 2026
E-PAPER
Homeఆటలుమహిళల హాకీ ఫైనల్‌‌కు నెదర్లాండ్స్‌, అర్జెంటీనా

మహిళల హాకీ ఫైనల్‌‌కు నెదర్లాండ్స్‌, అర్జెంటీనా

- Advertisement -

ఎఫ్‌‌ఐహెచ్‌ ‌హాకీ ప్రపంచకప్‌
అమ్‌‌స్టెల్‌‌వీల్‌(‌నెదర్లాండ్స్‌ :
ఎఫ్‌ఐహెచ్‌ ‌హాకీ మహిళల ప్రపంచకప్‌ ‌ఫైనల్లోకి ఆతిథ్య నెదర్లాండ్స్‌, అర్జెంటీనా జట్లు ప్రవేశించాయి. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో అర్జెంటీనా జట్టు 1-0తో ఆస్ట్రేలియాను, నెదర్లాండ్స్‌ ‌జట్టు 1-0తోనే మరో ఆతిథ్య దేశం బెల్జియంను ఓడించాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో అర్జెంటీనా తరఫున ఏకైక గోల్‌‌ను జులిటా(47వ ని.) చేయగా.. నెదర్లాండ్స్‌ ‌తరఫున ఏకైక గోల్‌‌ను మెట్లా ఫ్రీడెన్స్క్‌ (28వ ని.)లో చేశారు. శనివారం జరిగే ఫైనల్లో నెదర్లాండ్స్‌, అర్జెంటీనా జట్లు టైటిల్‌కోసం తలపడనుండగా.. బెల్జియం, ఆస్ర్టేలియా జట్ల మధ్య కాంస్య పతక పోరు జరగనుంది. శుక్రవారం జరిగిన పురుషుల వర్గీకరణ మ్యాచుల్లో న్యూజిలాండ్‌ 6-3‌తో ఐర్లాండ్‌‌ను ఓడించి 9వ స్థానంలో నిలిచింది. ఇక 11వ స్థానం కోసం పాకిస్తాన్‌-‌దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌ 4-4‌గోల్స్‌‌తో డ్రా కాగా.. పెనాల్టీ షూటౌట్‌‌లో పాకిస్తాన్‌ 4-3‌తో దక్షిణాఫ్రికాను ఓడించి 11వ స్థానంలో నిలిచింది. ఇక వేల్స్‌ ‌పురుషుల జట్టు కూడా షూటౌట్‌‌లో 2-1తో మలేషియాను ఓడించి 15వ స్థానంలో నిలువగా.. ఫ్రాన్స్‌ ‌జట్టు 3-1తో జపాన్‌‌ను ఓడించి 13వ స్థానంలో నిలిచింది. ఇక 5, 6 స్థానాలకు జరిగిన మరో మ్యాచ్‌‌లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు ఇంగ్లాండ్‌‌ను ఓడించి 5వ స్థానంలో నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -