‘డిజె టిల్లు’ చిత్రంతో సెన్సేషనల్ డెబ్యూ చేసిన దర్శకుడు విమల్ కృష్ణ, రాగ్ మయూర్ కథా నాయకుడిగా రూపొందిస్తున్న మరో యునిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనుమాన పక్షి’.చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ నిర్మించారు. సెప్టెంబర్ 18న ఈ సినిమా థియేటర్లలోకి రానుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల తేదీని తెలియజేస్తూ ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. సినిమా విభిన్నమైన టోన్‌తో పాటు హీరో విచిత్రమైన ఆలోచనా విధానాన్ని ఈ పోస్టర్ ప్రజెంట్ చేస్తోంది. రాగ్ మయూర్ సంప్రదాయ దుస్తుల్లో చేతిలో రైఫిల్ పట్టుకుని కనిపిస్తున్నారు. ఆయన పక్కనే ఉన్న బ్లాక్‌బోర్డుపై ‘డౌట్స్ అండర్ ఇన్వెస్టిగేషన్’ అనే టైటిల్‌తో జీవితం, విధి, కర్మ, దేవుడి ప్లనిన్గ్స్ సంబంధించిన ఆసక్తికరమైన ప్రశ్నలను పొందుపరిచారు. ‘ఒన్ బాయ్, బిలియన్ థాట్స్, జీరో చిల్’ అనే ట్యాగ్‌లైన్ ఆయన పాత్రలోని ఆలోచనా విధానాన్ని మరింత ఆసక్తికరంగా తెలియజేస్తోంది. ‘డీజే టిల్లు’తో తనదైన క్యారెక్టరైజేషన్, హ్యూమర్‌తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విమల్ కృష్ణ ఈ సినిమాని మరో వైవిధ్యమైన కాన్సెప్ట్‌ను తెరకెక్కి స్తున్నారు. ఇప్పటికే టీజర్, విభిన్నమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తిని పెంచిన ఈ చిత్రం మరో మూడు వారాల్లో థియేటర్లలోకి రానుంది. రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సిసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, రాసి, అజయ్, మస్త్ అలీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన -దర్శకత్వం: విమల్ కృష్ణ, సహ నిర్మాత: భరత్ లక్ష్మీపతి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ, క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రావణ్ కుప్పిలి, డిఓపి: సునీల్ కుమార్ నామా, ఆర్ట్ డైరెక్టర్: జేకే మూర్తి, ఎడిటర్: అభినవ్ కునపరెడ్డి.
యూనిక్ కామెడీ ఎంటర్‌టైనర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



