దర్శకుడు శ్రీవాస్ తన కొత్త చిత్రాన్ని ప్రకటిం చారు. మహంకాళి నాగరాజు నిర్మాణంలో మాధవి క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘ఫీనిక్స్ రాజా’ అనే టైటిల్ ఖరారు చేశారు. అరిగపూడి సుమిత్ కుమార్, శైలేష్ భంబురే, శ్యామ్ బొడపాటి సహ నిర్మాతలు.ముంబైలోని జుహూలో నోవాటెల్ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ‘ఫీనిక్స్ రాజా’ ఫస్ట్ పోస్టర్‌తో పాటు రెండు నిమిషాల పవర్‌ఫుల్ 2డీ మోషన్ టీజర్‌ను విడుదల చేశారు. ఇంగ్లీష్‌తో పాటు పలు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని భారత్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారు. వాస్తవ సంఘ టనలను, ప్రభావవంత మైన కథనంతో చూపిస్తూ కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయడమే లక్ష్యంగా సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకుడు శ్రీవాస్ తెలిపారు.ఈ కథ ఓ నిజాయితీగల వ్యాపారవేత్త చుట్టూ తిరుగుతుంది. రాజకీయ పలుకుబడి, అధికా రాన్ని ఉపయోగించుకోకుండా కష్టపడి, విలు వలు, నిజాయితీతో జీవితాన్ని నిర్మించుకోవాలని భావించే అతడి జీవితంలోకి పవర్ ఫుల్ వ్యక్తులు ప్రవేశించినప్పుడు.. అతడి వ్యక్తిగత పోరాటం కాస్తా నిజం, గౌరవం, భవిష్యత్ తరాల కోసం జరిగే పెద్ద పోరాటంగా మారుతుంది. ఈ చిత్రంలో మరో కీలక అంశంగా జెన్‌జీపై డ్రగ్ మాఫియా పెరుగుతున్న ప్రభావాన్ని చూపించ నున్నారు. రెండు నిమిషాల 2D మోషన్ టీజర్‌లో ప్రధాన పాత్రలను పూర్తిగా రివీల్ చేయకుండా కథలోని ప్రపంచాన్ని మాత్రమే పరిచయం చేశారు. కార్పొరేట్ పవర్, రాజకీయ ఎత్తుగడలు, డ్రగ్ నెట్‌వర్క్‌లు, న్యాయం, సత్యం వంటి అంశాలను టీజర్‌లో చూపించారు.ఆసక్తికరమైన సన్నివేశాలతోపాటు “అసలు ఫీనిక్స్ రాజా ఎవరు?” అనే ప్రశ్నతో టీజర్‌ను ముగించడం ఆసక్తిని మరింత పెంచింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఈ ‘ఫీనిక్స్ రాజా’ ఎవరు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



