Saturday, August 29, 2026
E-PAPER
Homeఖమ్మంచెట్లకు రాఖీలు కట్టి సంరక్షణ ప్రతిజ్ఞ

చెట్లకు రాఖీలు కట్టి సంరక్షణ ప్రతిజ్ఞ

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యవసాయ కళాశాల గ్రీన్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం వినూత్నంగా ‘వృక్ష రక్షాబంధన్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్. జె. హేమంత కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రీన్‌ క్లబ్‌ కార్యకలాపాల ఫెసిలిటేటర్‌ డాక్టర్. పి. నీలిమ సమన్వయంతో నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాల ప్రాంగణంలోని చెట్లకు రాఖీలు కట్టి, వాటిని తమ సోదరులుగా భావిస్తూ సంరక్షణ బాధ్యతను స్వీకరించారు.

ఈ సందర్భంగా డాక్టర్. జె. హేమంత కుమార్‌ మాట్లాడుతూ చెట్లు మానవాళికి ఆక్సీజన్‌, ఆహారం, నీడను అందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నాయని అన్నారు. చెట్లను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, వృక్షాలను కాపాడటం అంటే భవిష్యత్‌ తరాలను కాపాడటమేనని పేర్కొన్నారు. డా. జమీమా మాట్లాడుతూ ‘వృక్ష రక్షాబంధన్‌’ వంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణపై అవగాహన పెంపొందుతుందని అన్నారు. చెట్లను నాటడంతోపాటు వాటిని నిరంతరం సంరక్షించడం కూడా ముఖ్యమని తెలిపారు. విద్యార్థులు రాఖీలు కట్టి ‘చెట్లను కాపాడతాం.. పర్యావరణాన్ని పరిరక్షిస్తాం’ అంటూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -