హీరో సుమంత్ నటిస్తున్న ఆధ్యా త్మిక మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జగర్లపూడి దర్శకుడు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై లక్ష్మణ్, కలిపు మధు సంయుక్తంగా నిర్మి స్తున్నారు. తాజాగా మేకర్స్ థియే ట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ,‘ప్రతి డివైన్ సినిమా మన కల్చర్‌ని చెబుతుంది. మన కల్చర్‌తో ఏ సినిమా వచ్చినా మనం సపోర్ట్ చేయాలి. దాని నుంచి నేర్చుకోవాలి. ఇలాంటి సబ్జెక్ట్‌ని తీసుకున్న డైరెక్టర్ సంతోష్‌కి కంగ్రాజులేషన్స్. ట్రైలర్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా సుమంత్ కి ‘గోదావరి’ కంటే చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి’ అని అన్నారు. ‘ట్రైలర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా టీజర్ ఇప్పటికే చాలా వైరల్ అయింది. దానికంటే పది రెట్లు ఈ ట్రైలర్ మా సినిమాని ముందుకు తీసుకెళ్తుం దని ఆశిస్తున్నాను. ‘సుబ్రహ్మణ్య పురం’ తర్వాత డైరెక్టర్ సంతోష్‌తో ఇది నా రెండో సినిమా. ఈ సినిమా దాదాపు మూడేళ్ల జర్నీ. ఇది చాలా పెద్ద బడ్జెట్‌లో, పెద్ద స్థాయిలో తీయాల్సిన సినిమా.
అలాంటి సమయంలో మా నిర్మాతలు మధు, లక్ష్మణ్ సినిమాని చాలా అద్భు తంగా తీశారు. ఈ సినిమాలో మా డీజే టిల్లు కూడా ఉన్నాడు. ఫస్ట్ టైమ్ మేము ట్రైలర్‌లో రివీల్ చేశాము. తను చాలా కీలకమైన పాత్ర పోషించాడు. ఈ సంద ర్భంగా సిద్ధుకి థాంక్యూ. సెప్టెంబర్ 11న సినిమా రిలీజ్ అవుతుంది’ అని హీరో సుమంత్ తెలిపారు. డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ,‘ఈ సినిమా కచ్చితంగా థియేటర్లలో చాలా అద్భుతమైన అనుభూతిని అందించబోతుంది’ అని అన్నారు. ‘ట్రైలర్ చూసిన తర్వాత మాకు మరింత గొప్ప విశ్వాసం కలిగింది. డైరెక్టర్ చాలా ప్యాషన్‌తో పని చేశారు. ఈ ప్రయాణంలో వారాహి అమ్మవారు మాతోనే ఉన్నారని మా విశ్వాసం. షూటింగ్ సమయంలో ఎన్నో మిరాకిల్స్ జరుగుతుండేవి. మేము వాటిని ఎక్స్‌పీరియన్స్ చేశాం’ అని నిర్మాత మధు చెప్పారు. అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ,‘ సంతోష్ సినిమాని అద్భుతంగా తీశాడు. ఇది థియేటర్లలో ఎక్స్‌పీరి యన్స్ చేయాల్సిన సినిమా’ అని తెలిపారు.
హిట్ ఖాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



