Saturday, August 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుదుల్కర్ సల్మాన్ పాడిన‘లూజర్’ సాంగ్

దుల్కర్ సల్మాన్ పాడిన‘లూజర్’ సాంగ్

- Advertisement -

దుల్కర్ సల్మాన్ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ నుంచి రెండో సింగిల్ ‘లూజర్’ విడుదలైంది. జేక్స్ బిజోయ్ స్వరపరిచిన ఈ పాటను మలయాళంలో దుల్కర్ సల్మాన్ స్వయంగా ఆలపించారు. సుహైల్ కోయా సాహిత్యం అందించారు. మలయాళ వెర్షన్‌లో కె. బాలసరంగన్, జేక్స్ బిజోయ్ కూడా వోకల్ అందించారు. ఈ పాటను మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేశారు. తమిళ, తెలుగు వెర్షన్లను బెన్నీ దయాల్ ఆలపించగా, విఘ్నేష్ రామకృష్ణ (తమిళ్), సనారే(తెలుగు) సాహిత్యం అందించారు. హిందీ వెర్షన్‌ను బెన్నీ దయాల్ పాడగా, నుమాన్ ఖోకర్ సాహిత్యం అందించారు. కన్నడ వెర్షన్‌లో సాయి మాధవ్ రెళ్ల వోకల్ అందించగా, హృదయ శివ సాహిత్యం రాశారు. స్టైలిష్, ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజికల్ స్టైల్‌లో రూపొందిన ‘లూజర్’ సాంగ్ యువతను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రం సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్‌గా విడుదల చేయనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -