Saturday, August 29, 2026
E-PAPER
Homeఆదిలాబాద్చ‌రిత్ర సృష్టించిన ప్ర‌జ్ఞానంద‌

చ‌రిత్ర సృష్టించిన ప్ర‌జ్ఞానంద‌

- Advertisement -

గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ కైవసం
సెయింట్‌ లూయిస్: భారత యువ గ్రాండ్‌‌మాస్టర్‌ రమేష్‌‌బాబు ప్ర‌జ్ఞానంద చెస్‌‌లో అంచనాలకు మించి రాణిస్తున్నాడు. అమెరికా వేదికగా జరుగుతున్న గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ కైవసం చేసుకొని ఈ టైటిల్‌ ‌సాధించిన తొలి భార‌తీయ గ్రాండ్‌‌మాస్టర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ‌ గ్రాండ్ ఫైన‌ల్‌లో అమెరికాకే చెందిన ఫాబియానో కారౌనాను ఓడించాడు. ఆరంభంలో వెనుక‌బ‌డ్డ ప్రజ్ఞానంద.. ఆ త‌ర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. చివ‌ర‌కు 15-13 స్కోరుతో ఫాబియానోపై విజ‌యం సాధించాడు. జీసీటీ టైటిల్‌ను ప్ర‌జ్ఞానంద గెల‌వ‌డం ఇదే తొలిసారి. ఈ గెలుపుతో ప్రజ్ఞానందకు రెండు ల‌క్ష‌ల డాల‌ర్ల ప్రైజ్‌మ‌నీ ద‌క్కింది. చివ‌రి రోజు ఆరు పాయింట్ల లోటుతో ఉన్న ప్ర‌జ్ఞానంద .. కారౌనాతో జ‌రిగిన రెండు ర్యాపిడ్ గేమ్స్‌లో విజయం సాధించాడు. ఇక ఆ త‌ర్వాత బ్లిట్జ్ సెక్ష‌న్‌లోనూ అద్భ‌త ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చి 15-13తో టైటిల్ గెలుచుకున్నాడు. తొలి క్లాసిక‌ల్ గేమ్‌లో ప్ర‌జ్ఞా ఓడిపోయాడు. 6-0 తేడాతో ఆ గేమ్‌లో ప‌రాజ‌యాన్ని చూవి చూశాడు. ఆ త‌ర్వాత రెండో క్లాసిక‌ల్ గేమ్‌ను అత‌ను డ్రా చేసుకున్నాడు. 3-3 పాయింట్ల‌తో ఆ గేమ్ డ్రా అయ్యింది. అయితే ఆఖ‌రి రోజు 6 పాయింట్ల అడ్వాంటేజ్‌తో అమెరికా ప్లేయ‌ర్ ముందున్నాడు. కానీ ర్యాపిడ్ గేమ్స్‌తో ప్ర‌జ్ఞా మొత్తం మార్చేశాడు.

కాంటినెంటల్‌ ఛాంపియన్‌ సరయు
భారత సంతతికి చెందిన చిన్నారి సరయు తలపనేని అంతర్జాతీయ చెస్‌లో అరుదైన ఘనత సాధించింది. కొలంబియాలోని మెడెలిన్‌లో జరిగిన క్లాసికల్‌ చెస్‌ పాన్‌-అమెరికన్‌ పోటీల్లో 9కి 9 పాయింట్లు సాధించి కాంటినెంటల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. వారం రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో సరయు తొమ్మిది రౌండ్లు ఆడింది. ఉత్తర, దక్షిణ, మధ్య అమెరికాలకు చెందిన ఏడు దేశాల క్రీడాకారులతో తలపడింది. ఒక్క గేమ్‌లోనూ ఓటమి లేకుండా పర్ఫెక్ట్‌ స్కోర్‌తో టైటిల్‌ సొంతం చేసుకుంది. ఈ విజయంతో అమెరికా తరఫున పాల్గొన్న అతి పిన్న వయస్కులైన బాలికల్లో ఒకరిగా గుర్తింపు పొందింది. అలాగే ఈ ఏడాది చివర్లో జరిగే యూత్‌ చెస్‌ వరల్డ్‌ కప్‌లో అమెరికాస్‌ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకుంది. ఫిడే విమెన్‌ క్యాండిడేట్‌ మాస్టర్‌ టైటిల్‌కు అవసరమైన అర్హతను తాత్కాలికంగా సాధించిన అతి పిన్న వయస్కుల్లోనూ సరయు ఒకరిగా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -