Friday, September 18, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్పట్ట భద్రుల ఎమ్మెల్సీ 
ఓటర్‌ షెడ్యూల్‌ విడుదల

పట్ట భద్రుల ఎమ్మెల్సీ 
ఓటర్‌ షెడ్యూల్‌ విడుదల

- Advertisement -

నవంబర్‌ 6 ‌వరకు దరఖాస్తుల స్వీకరణ
డిసెంబర్‌ 30 న తుది ఓటర్ల జాబితా
ప్రకటన విడుదల చేసిన రాష్ర్ట ఎన్నికల సంఘం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ర్టంలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా షెడ్యూల్‌ విడుదలైంది. ఎలక్షన్‌ ‌కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు హైదరాబాద్‌-రంగారెడ్డి, వరంగల్‌-ఖమ్మం ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు జాబితా షెడ్యూల్‌‌పై తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌‌రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు వాణిదేవి, తీన్మార్‌ ‌మల్లన్న పదవి కాలం మార్చి 2027 నాటికి ముగియనుందని తెలిపారు. 2026 నవంబర్‌ 1‌ని ఓటరు నమోదుకు అర్హత తేదీగా పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. పట్టభద్రుల ఓట్ల నమోదు కోసం ఈ నెల 20న ఎన్నికల కమిషన్‌ పబ్లిక్‌ నోటీసు ఇవ్వనుందనీ, నవంబరు 6 వరకు ఓటరు దరఖాస్తులు స్వీకరించనుందని తెలిపారు. డిసెంబ‌ర్‌ 30న పట్టభద్రుల తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నామని తెలిపారు. గతంలో ఓటున్న వారు కూడా మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఫారం-18తో పాటు ధ్రువీకరించిన విద్యార్హత పత్రాలు సమర్పించాలన్నారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు సీఈఓ తెలంగాణ వెబ్‌సైట్‌లో అవకాశం ఉందని చెప్పారు. ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, డిజిగ్నేటెడ్ అధికారుల వద్ద ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే పోస్టు ద్వారా కూడా ఫారం-18 దరఖాస్తుల సమర్పణకు అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు.

ఓటర్‌ ‌షెడ్యూల్‌ ‌వివరాలు…
1). సెప్టెంబర్ 28న ఓటర్ల నమోదు ప్రక్రియకు నోటిఫికేషన్
2). నవంబర్ 1, 2026 అర్హత తేదీగా ఓటర్ల జాబితా తయారీ
3).నవంబర్ 6 వరకు ఫారం-18 దరఖాస్తుల స్వీకరణ
4).నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
5).నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాల స్వీకరణ
6). డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురణ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -