Saturday, August 29, 2026
E-PAPER
Homeఆటలుసెమీస్‌‌లో 
అల్కరాజ్‌, జకోవిచ్‌ ‌ఢీ

సెమీస్‌‌లో 
అల్కరాజ్‌, జకోవిచ్‌ ‌ఢీ

- Advertisement -

యుఎస్ ఓపెన్‌ ‌
గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ డ్రా విడుదల
న్యూయార్క్‌
: యుఎస్‌ ఓపెన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ డ్రా విడుదలైంది. గత ఏడాది యుఎస్‌ ఓపెన్‌ సెమీఫైనల్లో ‌తలపడిన డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్, నోవాక్ జకోవిచ్ ఈ ఏడాది కూడా సెమీస్‌‌లోనూ తలపడే అవకాశముంది. యుఎస్‌ ఓపెన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ డ్రాను నిర్వాహకులు గురువారం వెల్లడించగా.. రెండో సీడ్ స్పెయిన్‌కు చెందిన అల్కరాజ్, నాలుగో సీడ్ సెర్బియా వెటరన్ నోవాక్ జొకోవిచ్ వేర్వేరు గ్రూపుల్లో చోటు లభించింది. గత ఏడాది జరిగిన ఫైనల్లో అల్కరాజ్ 6-2, 3-6, 6-1, 6-4 తేడాతో జెన్నిక్‌ సిన్నర్‌ను ఓడించాడు. అయితే, మోకాలి గాయం కారణంగా ప్రపంచ నంబర్ వన్‌ ఇటలీకి చెందిన అల్కరాజ్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన బార్సిలోనా ఓపెన్ లో మణికట్టుకు గాయం ఇటీవలికాలంలో ఎలాంటి సింగిల్స్ మ్యాచ్ ఆడలేదు. ఇక 39 ఏళ్ల జోకోవిచ్ తన కెరీర్‌లో రికార్డు స్థాయి 25వ ‘మేజర్’ టైటిల్ అన్వేషణలోనే ఉన్నాడు. మూడేళ్ల క్రితం న్యూయార్క్‌లో ట్రోఫీని గెలుచుకున్న తర్వాత అతనికి మరే గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ దక్కలేదు. ఏడు గ్రాండ్‌‌స్లామ్‌ ‌టైటిళ్ల విజేత అల్కరాజ్, రష్యాకు చెందిన రోమన్ సఫియుల్లిన్‌తో తొలిరౌండ్‌‌లో తలపడనున్నాడు.

ఇక జొకోవిచ్ మొదటి రౌండ్‌లో అర్జెంటీనాకు చెందిన మరియానో నవోన్‌ను ఢీ కొట్టనున్నాడు. సిన్నర్ గైర్హాజరీలో ప్రపంచ నంబర్ 2 అలెగ్జాండర్ జ్వెరెవ్ అగ్రశ్రేణి సీడ్‌గా ఉన్నాడు. ఈ సీజన్‌లో రోలాండ్ గారోస్‌లో తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్న 29 ఏళ్ల ఈ జర్మన్ ఆటగాడు, ప్రారంభ రౌండ్‌లో ఇటలీకి చెందిన లొరెంజో సొనెగోతో తలపడనున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌‌లో టాప్‌‌సీడ్‌, బెలారస్‌‌కు చెందిన అర్యానా సబలెంకాకు టాప్‌ ‌సీడింగ్‌ ‌లభించింది. సెమీస్‌‌లో సబలెంక అమెరికాకు చెందిన పెగూలాతో, 2వ సీడ్‌, అమెరికా సంచలనం కోకో గాఫ్‌ ‌సెమీస్‌‌లో రైబకినాతో తలపడే ఛాన్స్‌ ఉంది. ప్రపంచ నంబర్ 1 సబలెంకా, 2024 ఫైనల్‌లో అమెరికాకు చెందిన జెస్సికా పెగులాపై 7-5, 7-5 తేడాతో విజయం సాధించి తొలి టైటిల్‌ను గెలుచుకుంది. అంతకుముందు ఏడాది జరిగిన ఫైనల్‌లో మరో అమెరికన్ అయిన అమండా అనిసిమోవాను 6-3, 7-6(3)తో ఓడించి తొలిసారి టైటిల్‌ను నిలబెట్టుకుంది. 2026 యూఎస్ ఓపెన్ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -