Saturday, August 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వ్యాయామ ఉపాధ్యాయుడికి సన్మానం

వ్యాయామ ఉపాధ్యాయుడికి సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-ఆలేర్ రూరల్ 
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని  ఆలేరు మండలం శారాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం వ్యాయామ ఉపాధ్యాయుడు మధును ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు మధు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడల్లో ప్రతిభ సాధించాలంటే కష్టపడి పనిచేయడంతో పాటు నిరంతరం సాధన చేయాలన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -