Saturday, August 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయానికి భక్తుల పాదయాత్ర

సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయానికి భక్తుల పాదయాత్ర

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
శ్రావణమాసం మూడవ శనివారం సందర్భంగా భక్తులు మూడు రాష్ట్రాల సరిహద్దులో గల మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు శనివారం భారీ సంఖ్యలో పాదయాత్రతో చేరుకున్నారు. జుక్కల్ మండలంలోని మాదాపూర్ హంగర్గా గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు భజన కీర్తనలతో దాదాపుగా 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టడంతో ఆంజనేయస్వామి ఆలయం భక్తుల సందడితో కిక్కిరిసిపోయింది. అన్నదానాలతో ఆలయ ఆవరణం భక్తులతో సందడిగా కనిపించింది. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ అధికారులు భక్తుల సహాయార్థం ముమ్మర ఏర్పాట్లు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -