- Advertisement -
నవతెలంగాణ-బాల్కొండ
మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో శనివారం తెలుగు భాష, జాతీయ క్రీడ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు తెలుగు భాష ప్రాముఖ్యత గురించి విద్యార్థులు వివరించారు. అదే విధంగా జాతీయ క్రీడా దినోత్సవాన్నీ పురస్కరించుకొని విద్యార్థులు పాఠశాల ఆవరణంలో క్రీడా విన్యాసాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు విఘ్నేశ్వర్, ఆకుల లక్ష్మణ్, ప్రిన్సిపాల్ విజయ్ కర్తన్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



