– పురపాలక సంఘం చైర్ పర్సన్ దండి లక్ష్మి
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
నేటి యువత ధ్యాన్ చంద్ ను స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలని పురపాలక సంఘం చైర్ పర్సన్ దండి లక్ష్మి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శనివారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ దండి లక్ష్మి మాట్లాడుతూ క్రీడా రంగానికి ధ్యాన్ చంద్ చేసిన సేవలను మరువ లేమన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారానికి ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు’గా పేరు మార్చి ఆయనను గౌరవించుకున్నామన్నారు. భారతదేశానికి 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లో వరుసగా మూడు బంగారు పతకాలను అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. హాకీ ఆటలో ఆయన చూపిన ప్రతిభకు గానూ ఆయనను ‘హాకీ మాంత్రికుడు’ అని పిలుస్తారన్నారు. అనంతరం క్రికెట్ గేమ్ లో గెలిచిన జట్టుకు ట్రోఫీ అందించారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ ,వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్స్ అనూష , లత , రజిత , తిరుపతి , బొలిశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు.
యువత ధ్యాన్ చంద్ స్ఫూర్తిగా తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



