Saturday, August 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా తెలుగు భాష, జాతీయ క్రీడా దినోత్సవం

ఘనంగా తెలుగు భాష, జాతీయ క్రీడా దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ  
మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో శనివారం తెలుగు భాష, జాతీయ క్రీడ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు తెలుగు భాష ప్రాముఖ్యత గురించి విద్యార్థులు వివరించారు. అదే విధంగా జాతీయ క్రీడా దినోత్సవాన్నీ పురస్కరించుకొని విద్యార్థులు పాఠశాల ఆవరణంలో క్రీడా విన్యాసాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు విఘ్నేశ్వర్, ఆకుల లక్ష్మణ్, ప్రిన్సిపాల్ విజయ్ కర్తన్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -